రూ. 48 వేల కోట్ల ప్రజాధనం డబ్బులను స్సెషల్ బిల్లుల పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసేసింది. ఖజానా నుంచి మళ్లించేసింది. ఈ స్పెషల్ బిల్లులేంటి ? అంటే ఎవరికీ తెలియదు. ఆర్థిక శాఖలో పని చేసిన నిపుణులకు కూడా ఈ స్పెషల్ బిల్లుల గురించి తెలియదు. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ గురించి తెలుసు కానీ.. కానీ ఈ స్పెషల్ బిల్లులేమిటో మాత్రం తెలియడం లేదు. ఈ బిల్లుల ద్వారా ఒకటి కాదు.. రెండు.. కాదు ఏకంగా రూ. 48 కోట్లు చెల్లించేశారు. ఆ బిల్లులేమిటో తెలియక కాగ్ కూడా సర్టిఫై చేయలేదు.
ఇప్పుడు ఆ రూ. 48వేల కోట్లు ఎటుపోయాయన్నది సస్పెన్స్ ధ్రిల్లర్‌గా మారింది. ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ప్రభుత్వం నుంచి రూపాయి పోవాలన్నా.. దానికో లెక్క ఉంటుంది . ఎన్నో ఆమోదాలు పొందాల్సి ఉంటుంది కాబట్టి రూ. 48వేల కోట్లు ఎక్కడికిపోయాయో.. ఎవరికి ఇచ్చారో ఖచ్చితంగా లెక్క ఉంటుంది. క్యాష్ డ్రా చేసి ఎవరికో ఇచ్చేయడానికి కూడా లేని పరిస్థితి. అంటే ప్రభుత్వం రూ. 48 కోట్లు చెల్లించిందన్నది నిజం. ఎవరికి చెల్లించింది..ఎందుకు చెల్లించింది అనేది చెప్పడానికి మాత్రం అంగీకరించడం లేదు. చివరికి కాగ్‌కు కూడాచెప్పడం లేదు. ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రజాధనం రూ. 48వేల కోట్లంటే మాటలు కాదు. ఏదో ఓ దశలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, కుంభకోణం బయటపడుతుంది. ఆదాయం లేకుండానే ఆదాయం చూపించి.. ఖర్చు చేసినట్లుగా చూపించడానికి ఇలా చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటివి అయినా పెద్ద స్కామే అవుతుంది. సత్యం కంప్యూటర్స్ స్కామ్ తరహాలో ఇదీ ఎప్పటికైనా బట్టబయలు అవ్వాల్సిందే. వైసీపీ నడుపుతోంది ప్రజా ప్రభుత్వం. ప్రజలకు నిజాలు చెప్పాలి. కానీ ఎన్నుకున్న ప్రజలకు అసలేం చేస్తున్నారో చెప్పకుండా సీక్రెట్ పాలన చేస్తున్నారు. అందుకే ఎన్నో అనుమానాలొస్తున్నాయి. ఇవాళ కాకపోతే .. రేపైనా ఆ రూ. 48వేల కోట్ల గుట్టు బయటపడాల్సిందే.