బీజేపీపై టీఆర్ఎస్ ప్రారంభించిన వడ్ల పోరులో సీరియస్ నెస్ అసలు లేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్ోతంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నేతలు.. బీజేపీ నేతలు.. కేంద్రమంత్రి నూకలు తినడం అలవాటు చేసుకోవాలని అన్నారంటూ సెంటిమెంటే రేపే ప్రయత్నం చేశారు. కానీ రియాక్షన్ అంతగా రాలేదు. ప్రెస్మీట్లకే ఇప్పటి వరకూ పరిమితమయ్యారు. గతంలోగా రోడ్లపైకి వచ్చి చేసే కార్యచరణ ఇంకా ఖరారు కాలేదు. తీర్మానాలు చేయడం మీడియాలో ప్రచారం చేసుకున్న వరకూ పనికి వస్తుంది.
ప్రస్తుతం యాదాద్రి ఆలయం పునం ప్రారంభోత్సవంతో పాటు ఉగాది పండుగ కారణంగా యుద్ధానికి విరామం ఇచ్చారు. రైతుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేలా.. కేంద్రంతోనే ధాన్యం కొనుగోలు సమస్య తలెత్తిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ.. ధాన్యం ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం రాసిచ్చిందని లేఖ బయట పెట్టింది. దీంతో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. తెలంగాణ ఉద్యమం తరహాలో అందర్నీ కలుపుకుని వడ్లపై పోరాటం చేయాలని భావిస్తున్నా.. ఇప్పుడు టీఆర్ఎస్ అందరికీ దూరమైంది. ఎవరూ కలిసి పని చేసే పరిస్థితి లేదు.
వడ్ల పోరు విషయంలో తెలంగాణ నేతలు ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. పూర్తి గా కేసీఆర్ ఆదేశాల మేరకు మాట్లాడుతున్నారు. కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి చిన్న మాట దొర్లినా అది బీజేపీకి అస్త్రంగా మారుతుంది. తెలంగాణ అధికార పార్టీగా టీఆర్ఎస్ ఉంది. సాంకేతికంగా వడ్లు.. ధాన్యం కొనుగోలు అంశం రాష్ట్రం ప్రభుత్వానికి బాధ్యత ఉంది. కేంద్రం ఎఫ్ సీఐ ద్వారా కొనుగోలు చేస్తుంది. ఈ కారణంగా వడ్ల పోరు విషయంలో టీఆర్ఎస్ నేతలు క్లూ లెస్‌గా ఉన్నారు. ఉగాది తర్వాత బీజేపీ కదిలేలా ఉద్యమం చేయకపోతే.. టీఆర్ఎస్ యుద్ధం తుస్సమన్నట్లే అవుతుంది. అది పార్టీని మరింత డ్యామేజీ చేస్తుంది.