రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా `టైగర్ నాగేశ్వరరావు`. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. కథ ఎప్పుడో సిద్ధమైపోయింది. ఈ ఉగాదికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రవితేజ చేతిలో `రామారావు ఆన్ డ్యూటీ`, `థడాకా`ఉన్నాయి. ఇవి పూర్తయిపోగానే… `టైగర్` పట్టాలెక్కుతుంది.
ఓ దొంగ బయోపిక్ తీయడం నిజంగా… షాకింగ్ విషయమే. అయితే.. టైగర్ నాగేశ్వరరావు కథలో అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన సంగతులున్నాయి. అవన్నీ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే విషయాలే. అందుకే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ భావిస్తున్నారు. పాన్ ఇండియా అంటే.. తెలుగులో తీసి, అన్ని భాషల్లోనూ డబ్ చేయడం కాకుండా, అథెంటిక్ గా.. ఈ సినిమాని తీయాలని చూస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ తారాగణాన్ని రంగంలోకి దింపాలన్నది ఆయన ప్లాన్. కథానాయిక, విలన్, ఇతర సపోర్టింగ్ రోల్స్ ఇలా.. అన్ని పాత్రలకూ స్టార్ కాస్టింగ్ నే తీసుకోవాలనుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా బిజీనే. వాళ్ల డేట్లు దొరకడం కష్టమవుతోంది. అందుకే ముందే డేట్లు లాక్ చేసుకొనే పనిలో పడ్డారు. సరిగ్గా ఇలాంటి కథతోనే.. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమా మొదలెట్టారు. కానీ.. ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు` దెబ్బతో ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.