బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మరోసారి ప్రతిపక్ష నేతలందరికీ ఉత్తరాలు రాశారు. కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని.. దర్యాప్తుసంస్తల్ని ఉపయోగించుకుని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. కలసి పోరాటం చేయడానికి ఇదే సరైనసమయం అని ఆమె అందరికీ ఆమె ఓ లేఖ రాశారు. ప్రస్తుతం మమతా బెనర్జీ దేశవ్యాప్త విమర్సలు ఎదుర్కొంటున్నారు. ఇతరపార్టీల వారి పట్ల తృణమూల్ నేతలు హత్యాకాండకు పాల్పడుతున్నారు. బిర్బూమ్ ప్రాంతంలో సజీవతంగా ఎనిమిదిని తగులబెట్టిసిన ఘటన సంచలనం సృష్టించింది . దీనిపై సీబీఐ విచారణ చేయాలని బెంగాల్ హైకోర్టు ఆదేశించింది.
దీంతో సీబీఐకి జనరల్ కన్సెంట్ బెంగాల్ ప్రభు్తవం ఇవ్వకపోయినా.. సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. కోర్టులు ఆదేశిస్తే అక్కడి ప్రభుత్వం అంగీకరించకపోయినా సీబీఐ విచారణ చేయవచ్చు. హైకోర్టే ఆదేశించడంతో సీబీఐ వెంటనే రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించింది. పలువురు తృణమూల్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమలో మమతా బెనర్జీ మళ్లీ ప్రతిపక్ష నేతలకు లేఖలు రాస్తున్నారు. అయితే మమతా బెనర్జీ ఎప్పుడూ అందర్నీ కలుపుకుని పోయేప్రయత్నం చేయలేదు. ఆమెకు అవసరం అయినప్పుడే పిలుస్తూ ఉంటారు. కేసీఆర్ చాలా కాలంగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అమె పట్టించుకోలేదు.
ఇప్పుడు అందరం కలిసి బీజేపీపై పోరాడదామని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతల ఇలాంటి తీరు వల్లే బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి కూటమి ఏర్పాటు కాలేకపతోంది. ఎవరికి వారు తాము గొప్ప అనుకుంటూ ఉంటారు. మమతా బెనర్జీ లేఖకు కొత్తగా వచ్చే స్పందన ఏదీ ఉండకవపోవచ్చని ఢిల్లీ వర్గాలుచెబుతున్నాయి. స్వార్థం కోసం లేదా కష్టం వచ్చినప్పుడు మాత్రమే.. ప్రాంతీయ పార్టీలు ఇలా పిలుపునిస్తున్నాయి కానీ నిజంగా బీజేపీని ఓడించడానికి కాదు. అక్కడే సరైన కూటమి ఏర్పాటుకు గండం ఏర్పడుతోంది.