ఆంధ్రప్రదేశ్ మంత్రుల మాటలు తేడాగా మారుతున్నాయి. మంత్రివర్గంలో అందర్నీ తొలగించి కొత్త వారికి చాన్సిస్తానని సీఎం జగన్ తన ప్రకటనకు అనుగుణంగా అందర్నీ మార్చేయబోతున్నారు. విధేయతను “దారుణంగా” ప్రదర్శించే వారి పదవులకూ గ్యారంటీ లేకుండాపోయింది. దీంతో వారి మాటలు తేడాగా మారుతున్నాయి. మంత్రి కొడాలి నానికి నిన్నటి వరకు పదవికి ఢోకా లేదన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తేడా కొడుతోంది. ఆయనను కూడా తప్పించి పార్థసారధికి లేకపోతే మరో నేతలకు చాన్సివ్వాలనుకుంటున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో కొడాలి నాని తన మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన టీడీపీని ఉద్దేశించి చేస్తున్నారుకానీ.. మంత్రిగా ఉన్నప్పుడు చూపించలేని విశ్వరూరం పోయిన తర్వాత ఏం చూపిస్తారని.. పదవి పోతుందన్న కోణంలో జగన్ పై మెంటల్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు . డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా అదో రకంగా మాట్లాడుతున్నారు. తనకు మంత్రిపదవిని తీసేస్తేనే హాయిగా ఉంటుందన్నారు.
ఇప్పుడు అంత ఒత్తిడి ఏం ఎదుర్కొంటున్నారని..పదవి పోతుందనే బాధతో అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. మిగిలిన వారు కూడా సన్నిహితుల వద్ద వైరాగ్యంతో మాట్లాడుతున్నారు. సామాజిక సమీకరణాలు.. విధేయత.. ఇతర కారణాలతో తమను కొనసాగిస్తారని ఎక్కువ మంది ఆశపడుతున్నారు. అలాంటి చాన్సులు లేవని తెలియడంతో ఎం మాట్లాడుతున్నారో వారికే తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.