బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ కి సినిమాల ద్వారా ఎన్ని అవకాశాలు వస్తున్నాయో తెలీదు గానీ, రెండు మూడు వారాలుండి వెళ్లిపోతున్న వాళ్లకు మాత్రం సినిమాల్లో గిరాకీ బాగానే దొరికేస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలకు. బిగ్ బాస్ ద్వారా కాస్త ఫేమ్ తెచ్చుకొన్న అమ్మాయిల్లో కొందరు ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీ. అలాంటి అమ్మాయిల్లో దివి ఒకరు. బిగ్ బాస్ 4 లో దివి బాగానే పాపులారిటీ సంపాదించుకొంది. బిగ్ బాస్ అవ్వగానే.. చిరంజీవి సినిమాలో ఆఫర్ దక్కించుకొంది. దాంతో పాటు ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి.
అయితే.. ఈ కొత్త జీవితాన్ని దివి సరిగా హ్యాండిల్ చేయలేకపోతోందేమో అనిపిస్తోంది. నాలుగు సినిమాలు చేతిలో ఉండేసరికి.. తానో స్టార్ అన్న ఫీలింగ్ వచ్చేసిందేమో.., ఒప్పుకొన్న సినిమాలకు సంబంధించిన షూటింగులకు దివి అందుబాటులో ఉండడం లేదట. చెప్పిన టైమ్ కి షూటింగ్ కి రావడం లేదని, పోన్ చేస్తే.. `ఈ రోజు మూడ్ బాగాలేదు` అనో `ఒంట్లో బాగా లేదు` అనో సాకులు చెప్పి తప్పిచుకొంటోందని ఓ నిర్మాత తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మిగిలినవాళ్లదీ ఇంచుమించుగా అదే పరిస్థితి. బిగ్ బాస్ ఫాలోయింగ్ వల్ల సినిమాలే కాదు. టీవీ షోల నుంచి కూడా పిలుపు వస్తుంటుంది. అక్కడి నుంచి కూడా ఆదాయం వస్తుంటుంది. అందుకే నాలుగు చేతులా సంపాదించడం స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు సినిమా, అక్కడి నుంచి వచ్చే పారితోషికాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. దివి కూడా అంతే నేమో.. తనకు సినిమా అప్పుడే బోర్ కొట్టేసి ఉంటుంది. కాకపోతే.. ఒప్పుకొన్న సినిమాలైనా సకాలంలో పూర్తి చేయాలి కదా..?