సినిమాలు తగ్గించుకొందో, లేదంటే.. అవకాశాలే తగ్గిపోయాయో తెలీదు కానీ, అనుష్క మాత్రం వెండి తెరపై కనిపించడం లేదు. నిశ్శబ్దం తరవాత.. అనుష్క చేసిన సినిమా ఏదీ తెరపైకి రాలేదు. కొన్ని సినిమాలు ఒప్పుకొందని ప్రచారం జరుగుతున్నా, వాటి గురించిన ఎలాంటి సమచారం లేదు. యూవీ క్రియేషన్స్‌లో అనుష్క ఓ సినిమా చేస్తోందని ప్రచారం జరిగింది తప్ప, ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేటూ లేదు. ఎట్టకేలకు ఈ సినిమా కొత్త కబురు బయటకు వచ్చింది. ఏప్రిల్ 4 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని, ఈ షెడ్యూల్ లో అనుష్క పాలు పంచుకుంటుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరో. టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క లుక్ పూర్తిగా కొత్తగా ఉంటుందని, త్వరలోనే ఆ లుక్ బయట పెడతామని చిత్రబృందం చెబుతోంది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి.. వారిద్దరి పేర్లూ కలిసేలా టైటిల్ ఖరారు చేస్తారని సమాచారం. భాగమతిలో అనుష్క చాలా లావుగా కనిపించింది. ఈ సినిమా కోసం తాను బాగా బరువు తగ్గినట్టు టాక్. ఇటీవల అనుష్క బయట ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారిగా స్లిమ్ అయి, కొత్త లుక్ లో బయటకు వస్తుందేమో..?