నెల్లూరులో ఇటీవల భారీ లిక్కర్ స్కాం వెలుగు చూసింది. గోవా మద్యాన్ని తీసుకు వచ్చి.. లోకల్ లేబుల్స్ వేసి ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే అమ్ముతున్నారు. అంటే ప్రభుత్వ మద్యమే అన్నట్లుగా అమ్ముతున్నారు. కానీ అది ప్రైవేటు వ్యక్తుల స్మగ్లింగ్ మద్యం. ఇలా ఎవరు చేస్తున్నారన్నది ఈ స్కాంను బయట పెట్టిన ఎస్ఈబీ అధికారులుతేల్చారు. ఎక్సైజ్ అధికారులే ఇలాచేస్తున్నారని నివేదిక ఇవ్వడంతో వారిపై బదిలీవేటు పడింది. ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన వారిపై కేవలం బదిలీ వేటా అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. దీనికి కారణం ఉంది. మద్యం దుకాణాల్లో ఉండేది వైసీపీ నేతలు సిఫార్సు చేసిన వారే.
ఇక ఎక్సైజ్అధికారుల్ని ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారిని నియమించుకుంటారు. దీంతో ఈ పెద్ద స్కాం వెనుక రాజకీయ నేతల హస్తం ఉంటుందన్న అభిప్రాయంబలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేల హ్యాండ్ లేకుండా ఇలాంటి నేరాలు జరిగే చాన్స్ లేదని.. ఖచ్చితంగా దర్యాప్తు జరిపితే.. ఎమ్మెల్యేల హస్తం బయటపడుతుందని టీడీపీ నే్త సోమిరెడ్డి లాంటి వాళ్లుఅంటున్నారు.
అంతేకాదు.. రాష్ట్రం మొత్తం కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీదనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. ఇలాంటి స్కాం ల కోసమే అలా చేస్తున్నామని.. మొత్తం మద్యం దుకాణాల వ్యవహారాలనూ ఆడిట్ చే్యాలంటున్నారు. గతంలోనూ ఇలాంటిస్కాంలు బయటపడ్డాయి. కానీ తూ..తూ మంత్రం చర్యలతో సరిపెట్టారు. దీంతో స్కాంలు అంతకంతకూపెరిగిపోయా.ి. చివరికి స్మగ్లింగ్ లిక్కర్ దర్జాగా అమ్మడం ప్రారంభించేశారు.కానీ బాధ్యులెవరో మాత్రం బయటపడటం లేదు.