మంత్రివర్గాన్ని పూర్తిగామార్చాలని జగన్ డిసైడయ్యారు. అయితే కొంత మందిని ఉంచుతానని చెప్పకనే చెప్పారు. కొంత మంది అంటూ ఎవరూ ఉండరని.. మంత్రివర్గంలో ఉండేది ఇద్దరేనని చెబుతున్నారు. వారిలో ఒకరు బొత్స సత్యనారాయణ, మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీరిద్దరిని మంత్రివర్గం నుంచి తప్పించడానికి జగన్ సాహసించలేకపోతున్నట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా జగన్ జైలుకెళ్తే.. తర్వాత ఏంటి అన్న చర్చ వైసీపీలో విస్తృతంగా అంతర్గతంగా జరుగుతోంది.ఈ క్రమంలో పెద్దిరెడ్డి, బొత్స సీనియర్ నేతలకు తమకే చాన్స్ వచ్చేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపించింది.
ఓ సారి పెద్దిరెడ్డి నేనే సీఎంను అయితే అనే డైలాగ్‌ను కూడా వాడారు. మంత్రిపదవుల నుంచి తొలగిస్తే ఈ ఇద్దరూ నేతలు అదే మహా ప్రసాదం అనుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. అందుకే జగన్మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిగతా అందర్నీ తొలగించి కొత్త వారికిచాన్సివ్వనున్నారు. విధేయతకు పట్టం కడతారని.. జగన్ ను ఇష్టం వచ్చినట్లుగా పొగుడుతూ.. ప్రతిపక్ష నేతలపై బూతులు మాట్లాడుతున్న నేతలకు ఉన్న పదవి ఉడిపోయే పరిస్థితి వస్తోంది. వారికి జిల్లా అధ్యక్ష పదవులు కాదు కదా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినా మంత్రి పదవికి సాటి రాదని వారికీ తెలుసు.
సీఎం జగన్.. పార్టీలో విధేయతకు పట్టం కట్టడం లేదని.. తిరుగుబాటు భయానికే లొంగుతున్నారన్న అభిప్రాయం ఈ కారణంగానే వస్తోంది. తొలగిస్తే అందర్నీ తొలగించాలి కానీ ఇద్దర్ని మాత్రం ఉంచాల్సిన అవసరం ఏమిటని అడిగేవారున్నారు. జగన్ గతంలోలా ఏకపక్షంగా కేబినెట్‌ను ప్రకటించే అవకాశం లేదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. మారుతున్న రాజకీయానికి ఇదే సాక్ష్యం అనుకోవచ్చు.