తెలంగాణ గవర్నర్ తాను వివాదాస్పదం కాదని.. పూర్తి స్థాయిలో స్నేహపూర్వకంగా ఉంటానని.., గర్విష్టిని కాదని పదే పదే కేసీఆర్‌కు సందేశం పంపుతున్నారు. ఉగాది వేడుకలకు రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. కేసీఆర్ రాలేదు.. మంత్రులు రాలేదు. అధికారులూ రాలేదు. దీంతో తమిళిశై బాగా ఫీలయ్యారు. ఆమె కేసీఆర్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు. తాను తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. ఇక ముందు ప్రజాదర్భార్లు విస్తృతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్ ఉందన్న తమిళిసై… ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగు వేశామని ప్రకటించారు. మే నుంచి ప్రజాదర్బారు నడుస్తుందని చెప్పారామె. అందులో వచ్చిన ప్రజాసమస్యలు ప్రభుత్వానికి నివేదించడం తప్పుకాదన్నారు. ప్రగతి భవన్లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్లేదాన్ని అని అన్నారు. తాను చాలా సార్లు ఆహ్వానించినా సీఎం, మంత్రులు రావడం లేదన్నారు. యాదాద్రికి తనను ఆహ్వానించలేదన్నారు.
మేడారానికి ఆహ్వానించకపోయినా వెళ్లానన్నారు.మొత్తంగా చూస్తే గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. తన ఉనికి చాటేందుకు గవర్నర్ తమిళిశై రెడీ అవుతున్నారు. ఈ పోరాటం ముందు ముందు చాలా ఉద్ధృతంగా సాగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. బెంగాల్, తమిళనాడుల్లో ప్రస్తుతం ఉన్న పరిణామాలుచోటు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే…పట్టుదలకు పోయి కేసీఆరే తెచ్చుకున్నారని అనుకోవచ్చు.