`నీదీ నాదీ ఒకే కథ`తో ఆకట్టుకొన్నాడు వేణు ఉడుగుల. ఇప్పుడు రానాతో `విరాటపర్వం` తెరకెక్కించాడు. ఈసినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ… వేణుకి అడ్వాన్స్ ఇచ్చింది. ఇది వరకే సితారలో ఓ కథ వినిపించాడు వేణు. అది ఆల్మోస్ట్ ఓకే. ఆ కథని ఎవరితో చేయాలి? అనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ కథకు పవన్ కల్యాణ్ అయితేనే బాగుంటుందని వేణు ఉడుగుల భావన. సితార కూడా అదే అనుకుంటోంది. పవన్ ని కూర్చోబెట్టి, కథ చెప్పించడం పెద్ద మేటరేం కాదు. మరోవైపు ఈ దర్శకుడికి చిరంజీవి నుంచి కూడా పిలుపు వచ్చినట్టు టాక్. విరాట పర్వం టీజర్ చిరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ సమయంలోనే వేణు ఉడుగుల తో..చిరు భేటీ వేశారని తెలుస్తోంది. `మంచి కథ ఉంటే చెప్పు.. చేద్దాం` అని అప్పుడే చిరు మాట ఇచ్చార్ట. నిజానికి చిరు తనని కలవడానికి వచ్చిన ప్రతీ దర్శకుడికీ ఇదే మాట చెబుతుంటారు. కాకపోతే.. ఈసారి కొంచెం సీరియస్ గా చెప్పేసరికి వేణు ఉడుగుల ఓ కథని రెడీ చేసుకోవడం.. చిరుకి `నా దగ్గర కథ ఉంది` అని సంకేతాలు పంపడం జరిగిపోయాయి. త్వరలోనే చిరు – వేణు మధ్య ఈ కథకు సంబంధించిన భేటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చిరంజీవి ఓకే అంటే.. చిరుతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. లేదంటే పవన్ కోసం తయారు చేసిన కథ ఎలాగూ రెడీగానే ఉంది. సో.. వేణు తదుపరి సినిమా మెగా బ్రదర్స్ లో ఒకరితో అన్నది ఖాయం