అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ అసెంబ్లీలో చర్చ కూడా పెట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం తీర్పును అమలు చేస్తోంది. తాజాగా తీర్పులో చెప్పినట్లుగా నెలలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఆ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్లో చాలా విషయాను ప్రస్తావించారు. ప్రధానంగా అమరావతి అభివృద్ధి కాలపరిమితి గురించి చెప్పారు.
అమరావతిలో పనులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మరో నాలుగేళ్ల గడువు పొడిగించిందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రైతుల ప్లాట్లు సహా ఇతరత్రా పనుల పూర్తికి తమకు 2024 జనవరి దాకా గడువు ఉందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు.రైతులకు అందించనున్న ప్లాట్లలో నెల రోజుల్లోగా పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నెలలో ప్రభుత్వం ఏమీ చేయలేదు. రైతులకు ఫోన్లు చేసి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మాత్రమే అడుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వమే గడువు పొడిగించిందని అఫిడవిట్ దాఖలు చేశారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో అసాధ్యమంటూ గడువునే ప్రభుత్వం.. జగన్ పేర్కొన్నారు. అలా గడువు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఇప్పుడు.. తమంతట తామే గడువు పెంచుకున్నామని హైకోర్టుకు చెప్పారు. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.