ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకుపవన్ కల్యాణ్ పరామర్శ యాత్రచేపట్టాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఉండగా ఉండాలని జనసేన అధినేత భావిస్తున్నారు. పోరాటాలే కాకుండా జనసేన తరపున ఆర్థిక సాయం కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నరైతుల వివరాలను ఇటీవల జనసేన శ్రేణులు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాయి. పంట నష్టాలతో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ శ్రేణులు సేకరించిన సమాచారం ప్రకారం గోదావరి జిల్లాల్లోనే 73 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉందని తేలింది. కొంతైనా ఊరట కోసం జనసేన పక్షాన ఆర్థిక సాయం అందించాలని నిర్ణియంచారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఈ సాయం రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. త్వరలోనే ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శిస్తాని ప్రకటించారు. కౌ రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు.
వారి పక్షాన జనసేన పార్టీ నిలుస్తుంది అని పవన్ ప్రకటించారు. స్వయంగా పరామర్శించి నగదు సాయం అందిస్తామని ప్రకటించడంతో జనసేన పార్టీ .. ప్రత్యేక వ్యూహం ఉందని భావిస్తున్నారు. గతంలో జగన్ .. ఓదార్పుయాత్ర తరహాలో చేసిన యాత్ర తరహాలో పవన్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని పరామర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓ రకంగా పవన్ కల్యాణ్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగాప్రజల్లోకి వస్తున్నట్లని అనుకోవచ్చు.