ఆర్.ఆర్.ఆర్ తరవాత… ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేయడం ఫిక్స్ అయిపోయింది. అయితే… బుచ్చిబాబు ఎప్పటి నుంచో స్క్రిప్టు పట్టుకొని వెయిటింగ్. `ఉప్పెన` తరవాత ఎన్ని ఆఫర్లు వచ్చినా.. ఎన్టీఆర్ కోసమే కాచుకుని కూర్చున్నాడు బుచ్చి. ఈ కథ కూడా ఎన్టీఆర్‌కి బాగా ఇష్టం. ఇదో స్పోర్ట్స్ డ్రామా. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దీనికి `పెద్ది` అనే టైటిల్ పెట్టుకొన్నాడు. అన్నీ ఓకే.. కానీ ఈ కథలో ఓ పెద్ద రిస్క్ ఉంది. ఇందులో కథానాయకుడు కొన్ని సీన్లలో వికలాంగుడిలా కనిపించాలి. ఎన్టీఆర్ ఇమేజ్‌కి అది సూటవుతుందా, లేదా? అనే సందేహం అందరిలోనూ ఉంది. ఇప్పుడు అదే డౌట్.. ఎన్టీఆర్‌కీ వచ్చిందని తెలుస్తోంది. కథలో ఆ భాగం చాలా కీలకం. దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. ఆ సీన్లు చేస్తే… ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే సందేహం ఎన్టీఆర్‌ని వెంటాడుతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే బుచ్చికి ఎన్టీఆర్ మాట ఇవ్వలేకపోతున్నాడని, అలాగని ఈ కథని వదులుకోవడం కూడా ఇష్టం లేదని.. కాబట్టే.. ఈ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. బుచ్చి కూడా కథని మార్చడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదట. `ఉప్పెన`లో కూడా ఇలాంటి రిస్కీ ఎలిమెంట్ ఉంది. క్లైమాక్స్‌ని మార్చమని చాలామంది… బుచ్చిపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ బుచ్చి మాత్రం తాను రాసుకున్న క్లైమాక్సే ఈ సినిమాకి కరెక్ట్ అని భావించాడు. తన మాటే నిజమై.. సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడూ బుచ్చిబాబు అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. `ఆర్.ఆర్.ఆర్` తరవాత పాన్ ఇండియా స్థాయి గుర్తింపు వచ్చాక.. ఎన్టీఆర్ ఇంత రిస్కు తీసుకుంటాడో, లేదో చూడాలి మరి.