వివిధ రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయిన వారి పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియబోతోంది. కేరళ-3, హిమాచల్ ప్రదేశ్-1, అస్సాం-2, నాగాలాండ్-1, త్రిపుర-1, పంజాబ్-5 సీట్లు ఖాళీ అవుతున్నాయి. కనుక ఆ 13 స్థానాల భర్తీకి ఎన్నికల కమీషన్ నిన్న షెడ్యుల్ ప్రకటించింది.
ఎన్నికల షెడ్యూల్: ఎన్నికల నోటిఫికేషన్ మార్చి-4; పోలింగ్-మార్చి 21న. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండే నామినేషన్లు స్వీకరిస్తారు.
ఈ ఎన్నికలు తరువాత ఆంధ్రప్రదేశ్-4 సీట్లు, తెలంగాణా-2 సీట్లు ఖాళీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెదేపా తరపున సుజనా చౌదరి, నిర్మాలా సీతారామన్ (బీజేపీ), జైరామ్ రమేష్, జెడి.శీలం(కాంగ్రెస్) తెలంగాణా నుండి వి.హనుమంత రావు, గుండు సుధారాణి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వారందరి పదవీకాలం జూన్ 21న ముగుస్తుంది. కనుక తరువాత వాటి కోసం కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది.