బోల్డ్ కంటెంట్ చూపించడంలో పూరి జగన్నాద్ ది డిఫరెంట్ స్టయిల్. పూరి కథలు చాలా వరకూ ఒక లైన్ ని దాటి చూపించినవే. ఇప్పుడు ‘లైగర్’లో కూడా ఓ బోల్డ్ పాయింట్ ని చూపించబోతున్నారు పూరి. విజయ్ దేవర కొండతో పూరి చేస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఇందులో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే లైగర్ పై ఆసక్తిని పెంచాడు పూరి. లైగర్.. సాలా క్రాస్ బ్రీడ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ క్యాప్షన్ కి కథలో మీనింగ్ వుంది. ఇందులో దిగ్గజ బాక్సర్ మైక్ టైషన్ కోచ్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఇందులో విజయ్ కి తండ్రి కూడా మైక్ టైసనే. ఇదే కథలో కీలకలం. అప్పటివరకూ కోచ్ గా వున్న మైక్ పాత్ర, ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా కనిపిస్తుంది. అంటే అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలా. అయితే ఇక్కడ కొత్తదనం ఏమిటంటే,.. మైక్ విదేశీ వ్యక్తి. విజయ్ పాత్ర స్వదేశి. రెండు జాతుల మధ్య సంకరీకరణాన్ని క్రాష్ బ్రీడ్ అంటారు. లైగర్ కి క్యాప్షన్ ఈ పాయింట్ నుంచే వచ్చింది. విజయ్, మైక్ ని తండ్రి కొడుకుల చూపించడం ఒక డిఫరెంట్ లైనే. అమ్మానాన్న తమిళమ్మాయిలో ప్రకాష్ రాజ్ పాత్ర కామన్ కథల్లో వుండేదే. లైగర్ విషయానికి వచ్చేసరికి ఒక విదేశీ ఫాదర్ రోల్ ని క్రియేట్ చేశాడు పూరి. మరి పూరి క్రియేషన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.