రాజీనామాలు తీసుకోవడానికే చివరి మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నట్లుగా స్పష్టం కావడంతో మంత్రులు ముందుగానే తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. మంత్రుల కోసం గత ప్రభుత్వం మంగళగిరి, విజయవాడ, రెయిన్ ట్రీ ట్రీ పార్క్ వంటి చోట్ల బంగళాలను సిద్ధం చేసింది. వాటిలోనే ప్రస్తుతం మంత్రులు ఉంటున్నారు. నిజానికి మంత్రులు ఉండేది తక్కువే. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదా ఉన్న వారు కూడా ఎక్కువగా నియోజకవర్గానికే పరిమిమతమవుతున్నారు. ఆ పదవి కూడా తీసేయడం ఖాయం కావడంతో ఎక్కువ మంది ఇళ్లు ఖాళీ చేసి .. తమ సామాన్లు తీసుకెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దాదాపుగా పది మంది మంత్రులు తమ పదవులు ఊడటం ఖాయమని నిర్ధారించుకుని ఇళ్లు ఖాళీ చేసేశారు. మిగతా వారు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. కొంత మంది మంత్రుల మాత్రం సొంత నివాసాల్లో ఉంటున్నారు. ఏడో తేదీన మంత్రుల వద్ద రాజీనామాలు తీసుకుని పదొకొండో తేదీన కొత్త మంత్రులతో ప్రమాణస్వీకార చేయించే అవకాశం ఉంది. వారికి ప్రస్తుతం మంత్రులు ఖాళీ చేస్తున్న ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం అమరావతిలో మంత్రులు, న్యాయమూర్తుల కోసం లగ్జరి విల్లాలను నిర్మించండ ప్రారంభించింది శ్లాబ్ దశకు వచ్చాయి. కానీ ప్రభుత్వం నిలిపివేయడంతో ఎక్కడివక్కడే ఉండిపోయాయి. దీంతో అందరూ అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోంది.