చంద్రబాబు, పవన్ కల్యాణ్ మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. గతంలో ఏపీని దోచుకుని అప్పుల పాలు చేశారని విమర్శించారు. నర్సరావుపేటలో వాలంటీర్లకు సన్మానాలు ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని విపక్షాలపై విమర్శలు చేయడానికే ఎక్కువ మసయం కేటాయించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా అన్నారు. వారు హైదరాబాద్లో మకాం వేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. తాను మారీచులు.. రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ప్రదానమంత్రి తనకు క్లాస్ పీకారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని.. తాను ప్రధానమంత్రితో భేటీ అయి నసమయంలో గదిలో తాను, ప్రధానమంత్రి మాత్రమే ఉన్నామన్నారు. ఆ విషయాలు బయటకు తెలియవన్నారు. అందుకే… ఆ మీడియా సంస్థలు చెప్పే వాటిని నమ్మనే నమ్మవద్దని ప్రజల్ని కోరారు. ఇటీవలి కాలంలో విపక్షాలు అప్పులతో పాటు పాలనా వైఫల్యాలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యతిరేకత ఓట్లు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ నేతర అరాచకాలు చర్చనీయాంశమవుతున్నాయి ఈ క్రమంలో వారి విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం తిట్ల రూపంలో వ్చచింది.
అంతకు ముందు వాలంటీర్ల సేవలను జగన్ ప్రస్తుతించారు. వాలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలు అందడానికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వారంతా గొప్పగా పని చేస్తున్నారని కీర్తించారు. మొత్తంగా సీఎం జగన్ రాను రాను అసహనానికి గురవుతున్నారన్న అభిప్రాయం తాజా స్పీచ్ ఉన్న వారికి అర్థమవుతోంది.