ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని సభ్యులు సీఎం జగన్ మినహా రాజీనామా చేశారు. మొత్తం జగన్తో కలిసి ఇరవై ఆరు మంది ఉంటారు. గౌతంరెడ్డి మరణంతో ఒకటి ఖాళీగా ఉంది. జగన్ కాకుండా మరో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు. వారందరి దగ్గర కేబినెట్ భేటీలో రాజీనామా పత్రాలు తీసుకున్నారు. ముందుగానే లెటర్ ప్యాడ్లు తెచ్చుకోవాలని సమాచారం ఇచ్చారు. ఆ మేరకు కేబినెట్ భేటిలో వారితో రాజీనామా పత్రాలు రాయించి తీసుకున్నారు. వాటిని గవర్నర్కు పంపుతారు. కొత్త మంత్రుల జాబితాను రెండు, మూడు రోజుల్లో లీక్ చేయడం లేదా అధికారికంగా విడుదల చేయడం చేసే అవకాశం ఉంది.
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పలువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రి కొడాలి నాని కొత్త కేబినెట్లో ఐదారుగురు కొనసాగవచ్చని ప్రకటించారు. కొత్తకేబినెట్లో తాను ఉండే అవకాశం తక్కువ అన్నారు. అయితే ఆ ఐదారుగురు ఎవరన్నదానిపై క్లారిటీలేదు. అందరి దగ్గరా రాజీనామా లేఖలు తీసుకున్నారు. కొనసాగించాలనుకున్న వారి రాజీనామా లేఖలనుపక్కన పెట్టి.. గవర్నర్కుపంపితే వారిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఒక వేళ మంత్రులందరి రాజీనామా లేఖలను గవర్నర్కు పంపితే..కొత్తగా వారితోనూ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. మొత్తంగా కేబినెట్ వ్యవహారాన్ని వైసీపీ నేతలు ఓ ఈవెంట్లా కొనసాగిస్తూండటం వైసీపీ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మీడియాలో ఇతర సమస్యలు ప్రచారం కాకుండా..క ఈ కేబినెట్ గురించి చర్చించుకుంటే చాలన్నట్లుగా ఈ ఈవెంట్ నడుపుతున్నారని అంటున్నారు.