రాజశేఖర్ కుమార్తె… శివానీపై ఓ రూమర్ చక్కర్లుకొడుతోంది. బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ పారిపోయిందని, ఇంట్లో వాళ్లు కంగారు పడుతున్నారని ఏవేవో గాలి వార్తలు టాలీవుడ్ అంతా తిరుగుతున్నాయి. వాటిపై శివానీ స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది. తన ఇన్‌స్టా లో దుబాయ్‌లో ఫ్యామిలీతో తీయించుకున్న ఫొటో ఒకటి పెట్టి.. `దుబాయ్ వెళ్లింది వీళ్లతోనే.. ఇప్పుడు చెప్పండి.. వీళ్లలో నా బోయ్‌ఫ్రెండ్ ఎవరు? నేను గానీ, శివాత్మిక గానీ ఎవరితో పారిపోయాం..? నెక్ట్స్ లెవల్ న్యూస్… నాన్సెన్స్ రూమర్స్` అంటూ.. గట్టిగా సమాధానం చెప్పింది. రూమర్లు రాసేటప్పుడు చెక్ చేసుకోవాలని హితవు పలికింది. ప్రస్తుతం రాజశేఖర్ కుటుంబం దుబాయ్ వెళ్లారు. అక్కడ వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నారు. దాంతో.. శివానీ ఓ బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని దుబాయ్ వెళ్లిందన్న రూమర్ పుట్టించేశారు. వాటికి… శివానీ ఇలా చెక్ పెట్టేసింది. నిజానికి తమపై ఎన్ని రూమర్లు వస్తున్నా… సెలబ్రెటీలు లైట్ తీసుకుంటుంటారు. సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. కానీ.. అలా వదిలేస్తే.. అవే చిలవలు పలవలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ సంగతి ముందే గ్రహించి… శివానీ ఇలా రంగంలోకి దిగింది.