బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నవాళ్లకు వెండి తెర అవకాశాలు బాగానే వస్తున్నాయి. అలా ఓ నటి కూడా.. బిగ్ బాస్ తో పాపులర్ అయి, సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. సినిమా జీవితం బాగుంటుందని ఆశల పల్లకిలో విహరిస్తున్న ఆ నటికి ఇప్పుడు నిర్మాతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని టాక్. `నిన్ను అన్ పాపులర్ చేస్తాం.. కావాలంటే చూడు` అంటూ హెచ్చరిస్తున్నార్ట.
వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 4 సీజన్ లో రాణించి దర్శఖ నిర్మాతల చూపు తన వైపుకు తిప్పుకున్న ఓ నటికి వరుసగా అవకాశాలొస్తున్నాయి. అందులో భాగంగా ఓ చిన్న సినిమా కూడా ఒప్పుకుంది. హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో షూటింగ్ జరుగుతున్న వేళ.. ఓ అర్థరాత్రి వేళ, ఆసినిమా నిర్మాతలు ఫుల్లుగా తొగొచ్చి, ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై అసభ్యకరంగా ప్రవర్తించారని తెలుస్తోంది. దాంతో.. ఆమె ఎదురు తిరిగిందని, నిర్మాతల టార్చర్ భరించలేక అక్కడి నుంచి హుటాహుటిన ఇంటికి వెళ్లిపోయిందని, దాంతో నిర్మాతల ఈగో హర్టయి.. `నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాం.. నీకు సినిమాలు రాకుండా అడ్డుకుంటాం` అని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారట. తనకొచ్చిన ఒకట్రెండు అవకాశాలు కూడా ఈ నిర్మాతల వల్లే పోయాయని, ఆమె వాపోతోంది. ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చుకుంటానని, అవసరమైతే.. పెద్దల్ని సంప్రదిస్తానని చెబుతోందామె. మొహమాటాలన్నీ వదిలేసి, మీడియా ముందుకొస్తే గానీ, ఆ నిర్మాతల యవ్వారం బయట పడదు. మరి ఈ వ్యవహారంలో ఈ నటి ఎలాంటి అడుగు వేస్తుందో చూడాలి.