తెలంగాణ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి 24గంటల డెడ్ లైన్ పెట్టారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. ఒక దేశం ఒకటే ధాన్య సేకరణ విధానం ఉండాలంటూ నినదించాు. కేసీఆర్కు రైతు నేత రాకేష్ టికాయత్ మద్దతు పలికారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. 2 వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న ఢిల్లీకి తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులు, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు రావాల్సి వచ్చిందో దేశం మొత్తానికి తెలియాలన్నారు.
మేం గోల్ మాల్ చేశామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్న ఆయన పీయూష్ గోయల్ కాదని, పీయూష్ గోల్ మాల్ అని మండిపడ్డారు. తెలంగాణకు ఓ వ్యక్తిత్వం, అస్తిత్వం ఉందన్నారు. రాష్ట్రంలో భూములు, వర్షాలు, పరిస్థితుల ఆధారంగా రైతులు పంటలు వేయడాన్ని మార్చాలని, వేరే పంటలు వేయాలని తమ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర రైతులను కోరారని కానీ ప్రభుత్వం మాటలు వినవద్దని, రైతులు తమ ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవాలని కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి చెప్పారన్నారు. ఆ వీడియోను సభలో ప్రదర్శించారు.
కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాటమార్చి వారిని దారుణంగా మోసం చేశారని.. బీజేపీకి, కేంద్రానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.దేశంలో రైతుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభం కావాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తెలంగాణ ప్రజలంతా మీ వెంట ఉంటారన్నారు. ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం సేకరణపై నిర్ణయం ప్రకటించకపోతే.. కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.