ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చేసేవారంతా. అంతేకాద.. మిగతా పరిశ్రమల వైపు బాలీవుడ్ జనాలు చిన్నచూపు చూసే పరిస్థితి కూడా వుండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. బాహుబలి ఇండియన్ సినిమా ఈక్వేషన్లు మార్చేసింది. ఈ సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తర్వాత పుష్ప, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా ప్రభంజనం సృష్టించాయి. రాధేశ్యామ్ కలెక్షన్స్ పరంగా బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించలేనప్పటికీ మేకింగ్ పరంగా ప్రపంచస్థాయి సినిమాకి ధీటుగా వుందనే ప్రసంసలు దక్కాయి.
పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు సౌత్ సినిమానే అనే భావన ఏర్పడింది. సహజంగానే సౌత్ ఆధిపత్యాన్ని భరించలేని బాలీవుడ్ కు .. ఇప్పుడు సౌత్ సినిమాల జోరు గట్టి పోటిని ఇస్తుంది. ఇప్పుడు కేజీయఫ్ 2 కూడా బాలీవుడ్ కి ఛాలెంజ్ విరసరాడానికి సిద్దమౌతుంది. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ లు అదిరిపోయాయి. కేజీయఫ్ గనుక విజయం సాధిస్తే ఇండియన్ సినిమా, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాపై సౌత్ ఇండస్ట్రీ మరింత పట్టు సాధించినట్లవుతుంది. నిజానికి బాలీవుడ్ లో కొంత కాలంగా మంచి కంటెంట్ రావడం లేదు. ఒక పెద్ద హిట్ లేదక్కడ. సౌత్ నుంచి వెళ్ళిన పాన్ ఇండియా సినిమాలే కోట్లు కొళ్ళగోడుతున్నాయి. ఇప్పుడు కేజీయఫ్2 గనుక విజయం సాధిస్తే ఇండియన్ సినిమాపై సౌత్ సినిమా మరింత పైచేయి సాధించినట్లే.