మంత్రి పదవి ఇవ్వనైతే ఇచ్చారు కానీ బొత్స సత్యనారాయణతో మాత్రం వైసీపీ పెద్దలు ప్రాక్టికల్ జోక్ వేసేశారు. ఆయనకు విద్యాశాఖ కేటాయించేశారు. అది తప్ప మరో శాఖ లేదు. పెద్దిరెడ్డికి పాత శాఖలతో సహా లీకమైనవన్నీ తిరిగొచ్చారు. హోంమంత్రిగా తానేటి వనితను ఖరారు చేశారు. గతంలోలాగే ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఖరారు చేశారు. మళ్లీ మంత్రి పదవులు దక్కించుకున్న డిప్యూటీ సీఎంలు అంజాద్ భాషా, నారాయణస్వామిలకు అదే హోదా ఇచ్చారు.
పీడిక రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణలకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అయితే డిప్యూటీ సీఎంలు అవడం వల్ల కొత్తగా ప్రోటోకాల్ కూడా ఏమీ లభించే అవకాశం లేదు. రోజాకు టూరిజం శాఖ దక్కింది. అంబటి రాంబాబుకు ప్రాధాన్యమైన ఇరిగేషన్ శాఖ దక్కింది. మూడేళ్ల పాటు పని చేసిన మంత్రుల్లో ఎవరు ఏ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తారో స్పష్టమైన ముద్ర వేయలేకపోయారు.
ఒకరి శాఖకు సంబంధిచి ఒకరు ప్రకటనలు చేస్తూ ఉండేవారు . చివరికి అంతా గందరగోళం అయిపోయింది. ఈ సారి అయినా పూర్తి స్థాయిలో మంత్రులుగా పని చేస్తారో.. లేకపోతే.. సీఎంవో .. సలహాదారులు ఇచ్చే సూచనలు మేరకు పని చేస్తారో చూడాల్సి ఉంది.