కేజీఎఫ్ హిట్టవ్వడంతో… కేజీఎఫ్ 2కి అంకురార్పణ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. కేజీఎఫ్ కంటే.. పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు బిజినెస్ కూడా అంతకు మించి జరిగింది. ఇప్పుడు బాలీవుడ్ తో సహా చిత్రసీమలన్నీ.. కేజీఎఫ్ 2పై దృష్ట పెట్టాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే.. `సలార్`. దీనికి కూడా కేజీఎఫ్ ఫార్ములానే అప్లయ్ చేశాడని, సలార్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పుడు ప్రశాంత్ నీల్ స్పందించాడు.
కేజీఎఫ్ 2 ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ నీల్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా కేజీఎఫ్ హిట్టయ్యాక పార్ట్ 2 అనే ఆలోచన వచ్చింది. సలార్ చిత్రీకరణ సమయంలోనే.. రెండు భాగాలుగా చేయాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ప్రశాంత్ కాస్త చాకచక్యంగా స్పందించాడు. “రెండు భాగాలని ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు. అనుకుంటే మాత్రం.. ఓ పెద్ద ఈవెంట్ నిర్వహించి చెబుతాం“ అని క్లారిటీ ఇచ్చాడు. దాంతో.. రెండు భాగాలుగా తీస్తున్నట్టా, కాదా? అనే డౌటు ఇంకా కొనసాగుతూనే ఉంది. సలార్ గురించి మాట్లాడడానికి ప్రశాంత్ నీల్ పెద్దగా ఇష్టపడడం లేదు. ఎందుకంటే… ఇప్పుడు తన ధ్యాసంతా.. కేజీఎఫ్ 2పైనే ఉంది. సలార్ గురించి ఏం మాట్లాడినా టాపిక్ డైవర్ట్ అవుతుందని, కేజీఎఫ్‌కి రావాల్సిన మైలేజీ, పబ్లిసిటీ రాకుండా పోతుందన్నది ప్రశాంత్ నీల్ భయం కావొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. సలార్ హిట్టయితే… పార్ట్ 2 ఉంటుంది. లేదంటే లేదు. ఎందుకంటే.. ఇది కూడా అచ్చంగా కేజీఎఫ్ ఫార్ములానే. కేజీఎఫ్ ఊహించనంత విజయం అందుకుంది కాబట్టి ప్రశాంత్ పార్ట్ 2 తీసే ధైర్యం చేశాడు. లేదంటే.. ఇప్పుడు ఈ సినిమానే ఉండేది కాదు కదా..? సలార్ విషయంలోనూ అదే జరగొచ్చు.