రెవిన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత .. రెవిన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందనే ప్రకటన చేశారు . దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు రాజకీయంగా.. ఇటు అధికార వర్గాల్లోనూ ఈ వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా చూస్తే రెవిన్యూ శాఖను అప్పటి వరకూ నిర్వహించింది తన అన్న ధర్మాన కృష్ణదాసే. అంటే.. అన్నపైనే తమ్ముడు ప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారన్నమాట. ఈ విషయంలో కృష్ణదాసు ఇంకా కుమిలిపోతున్నారు కానీ బయటపడలేదు.
అయితే ఉద్యోగులు మాత్రం ఊరుకోవడం లేదు. రెవిన్యూ సర్వీసెస్ ఉ్దయోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు తెర ముందుకు వచ్చి… ధర్మాన తమను అవినీతి పరులు అనడం ఏమిటన్నారు. నిజాయితీగా పని చేసేది తామేనన్నారు. కొత్త మంత్రిగా గారు కాబట్టి …బొప్పరాజు కాస్తంత పౌలైట్గా నే చెప్పుకున్నారు. ఆయనకు మంత్రితో చాలా పనులు ఉండి ఉండవచ్చు. అయితే ఉద్యోగులు మాత్రం ధర్మాన తీరుపై అసంతృప్తితో ఉన్నారు.
సీనియర్ మంత్రిగా ధర్మాన అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని కొంత మంది అంటున్నారు. కనీసం తన అన్నను గౌరవించాల్సిందని అంటున్నారు. వైసీపీలో జగన్ వెంట మొదట నడిచింది ధర్మాన కృష్ణదాసు. అన్నీ అనుభవించి చివరిలో వైసీపీలో చేరింది ప్రసాదరావు. ఇప్పుడు అన్న మంత్రి పదవునే పొందారు అయినా ఆయనపై అవినీతి ఆరోపమలు చేస్తున్నారని కృష్ణదాసు అనుచరులు విమర్శిస్తున్నారు.