లైగర్ ని దాదాపు పూర్తి చేశాడు విజయ్ దేవర కొండ. జనగణమన సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. అయితే అంతకంటే ముందే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంతని కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమాకి ముహూర్తం ఖరారైయింది. ఈ నెల 21న హైదరాబాద్ లో ఈ సినిమాకి పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
కాశ్మీర్ నేపధ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. ఈ నెల 23 నుంచి కాశ్మీర్ లోనే షూటింగ్ మొదలుపెడుతున్నారు. ఇదో డిఫరెంట్ లవ్ స్టొరీగా ఉండబోతుంది. అందుకే కాస్టింగ్ లోనే చాలా వైవిధ్యం కనిపించింది. సమంత సీనియర్ హీరోయిన్. విజయ్ ఆమె కంటే జూనియర్. మహానటి సినిమాలో కలసి స్క్రీన్ పంచుకున్నా .. అవి సైడ్ క్యారెక్టర్లగానే వుంటాయి. కానీ ఇప్పుడు వీరిద్దరూ ప్రేమికులుగా కనిపించబోతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై సహజంగానే ఆసక్తి పెరిగింది.ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ పరిశీలనలో వుంది.