నెల్లూరు నేతలకు హైకమాండ్ సున్నితంగా చెప్పినా వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా కాకాణి గోవర్దన్ రెడ్డిపై కాలుదువ్వడానికి అనిల్ కుమార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కాకాణి ర్యాలీకి పోటీగా సభ నిర్వహించిన ఆయన … తర్వాతిరోజే ఏకంగా మంత్రి నియోజకవర్గంలో బలప్రదర్శన చేపట్టే ప్రయత్నం చేశారు. వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామానికి చెందిన కూకటి శ్రీధర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు అనిల్. సర్వేపల్లి గ్రామంలో యాదవుల కుల దేవత గంగమ్మ ఆలయాన్ని సందర్శించుకుని పూజలు చేశారు.
అనిల్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు తరలి వచ్చారు. బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. ఇలా కాకాణి ఇలాకాలో భారీ కాన్వాయ్ తో, బాణసంచా కాల్పులతో ఎంట్రీ ఇచ్చారు అనిల్.ఇది చర్చనీయాంశమయింది. ఎందుకంటే మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్లిన సందర్భాలు అనిల్‌కు లేవు. తాను మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికి కాకాణి పిలవలేదని అనిల్ నేరుగానే చెప్పారు. ఇప్పుడు మంత్రి వర్గంలోనుంచి బయటకొచ్చిన తర్వాత అనిల్.. కాకాణి ఇలాకాలో తొలిసారిగా అడుగు పెట్టారు.
కాకాణి కూడా ఏమీ తగ్గడం లేదని.. అనిల్ నియోజకవర్గం నెల్లూరు సిటీలో అడుగు పెట్టబోతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి సిటీలో పర్యటిస్తారు. కాకాణి, ఆనం ఇద్దరూ అనిల్‌కు దూరమే. దీంతో ఆయన హాజరు కారు. వచ్చే ఎన్నికల్లో అసలు అనిల్‌కు టిక్కెట్ దక్కకుకుండా అనం కుటుంబీకులకు టిక్కెట్ దక్కేలా చేయాలనేది వారి ప్లాన్ అని అనిల్ అనుమానిస్తున్నారు.