చిరంజీవి ఓ కమర్షియల్ కథ కోసం అన్వేషిస్తున్నారు. ఏ కొత్త దర్శకుడు కనిపించినా `నీ దగ్గర కమర్షియల్ స్టోరీ లైన్ ఏమైనా ఉందా` అని అడుగుతున్నారు. అయితే తన కోసం కాదు. వరుణ్ తేజ్ కోసం. వరుణ్ మంచి పొటన్షాలిటీ ఉన్న హీరో. మంచి కథ వస్తే.. దుమ్ము దులుపుతాడు. మంచి హిట్లు కూడా ఉన్నాయి. అయితే `గని` బాగా నిరాశ పరిచింది. ఎంతంటే.. `వరుణ్‌కి థియేటరికల్ బిజినెస్ లేదేమో` అనిపించేంతలా..! ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. అయితే అది ఏసీ డీసీ. ప్రవీణ్ సత్తారు ఎప్పుడూ కమర్షియల్ గా గొప్ప కథలేం తీయలేదు. బాక్సాఫీసు దగ్గర ఓకే అనిపించే సినిమాలే అన్నీ. కాకపోతే విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కుతాయి. వరుణ్‌కి అదేం కొత్త కాదు. కాబట్టి తనకు ఇప్పుడు బాక్సాఫీసు దగ్గర కమర్షియల్ హిట్ కావాలి.
ఆ బాధ్యతని చిరు తీసుకున్నట్టు తెలుస్తోంది. `గని` రిజల్ట్ తో చిరు కూడా చాలా అప్ సెట్ అయ్యారని వినికిడి. `గని` బాధ్యతల్ని పూర్తిగా అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ తీసుకుంది. ఈ విషయంలో చిరు ఏమాత్రం జోక్యం చేసుకోలేదు.ఫలితం రివర్స్ కొట్టేసరికి… వరుణ్ తేజ్ కెరీర్‌ని గాడిలో తీసుకోవాల్సిన బాధ్యత గుర్తించారు. అందుకే చిరు రంగంలోకి దిగారు. ప్రవీణ్ సత్తారు సినిమా కంటే ముందు.. ఓ కమర్షియల్ కథని ఓకే చేసి, పట్టాలెక్కించి, రెండింటినీ సమాంతరంగా పూర్తి చేయాలన్నది ప్లాన్.