ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది ఎఫ్ 3. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈమధ్యే… పూజా హెగ్డేతో ఓ స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోంచి `ఊ.. ఆ…` అనే పాటొకటి వస్తోంది. శుక్రవారం ఈ పాటని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ప్రోమో బయటకు వచ్చింది. ఈ పాట కూడా ఓ ఐటెమ్ గీతంలానే ఉంది. తమన్నా, మెహరీన్.. శారీల్లో రొమాంటిక్ గా దర్శనమిచ్చారు. తమన్నా అయితే చాలా కాలం తరవాత మునిపటి గ్లామర్‌ని తెచ్చుకున్నట్టు కనిపించింది. వెంకీ, వరుణ్‌లు.. మాసీ స్టెప్పులు వేస్తూ.. రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాటలో సునీల్ కూడా మెరవబోతున్నాడు. తనకు జోడీగా సోనాల్ చౌహాన్ కనిపించనుంది. అంటే ఈ మూడు జంటలతో.. దర్శకుడు ఊ..ఆ… అనిపించబోతున్నాడన్నమాట. చూస్తుంటే మంచి రొమాంటిక్ నెంబర్లా ఉంది. దేవిశ్రీ దాన్ని మాస్ బీట్ లా మార్చేశాడు. ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్టయ్యినా.. పాటలు కాస్త వీక్‌గానే వినిపించాయి. అయితే ఈసారి ఆ కంప్లైంట్ రాకుండా.. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దేవి. డబ్బుపై సాగిన తొలి గీతం బాగానే ఆకట్టుకుంది. మరి.. ఈ ఊ.. ఆ… ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.