ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్రం విస్తృతంగా సహకారం అందిస్తూనే ఉంది. కానీ లేఖలు మాత్రం కఠినంగా రాస్తోంది. కేంద్రం తీరు చూసి ఆర్థిక శాఖ అధికారులు కూడా నవ్వకుంటున్నారు. అన్ని రకాల అప్పుల వివరాలు చెప్పకపోతే కొత్త అప్పులకు పర్మిషన్ ఇవ్వబోమంటూ కొత్తగా లేఖ వచ్చింది.అది ఒక్క ఏపీకే కాదు మొత్తం అన్ని రాష్ట్రాలకు రాశారు. అయితే ఏ రాష్ట్రానికిఅప్పుల పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఏపీకి మాత్రం ఇచ్చారు. ఈ అప్పుల పర్మిషన్ తో ఇప్పటికే ఆర్బీఐ నుంచి రూ. నాలుగు వెల కోట్లను రెండు వారాల్లో అప్పులు తెచ్చేసుకుని రూ. వెయ్యి కోట్లను ఓ పథకం కింద మీట నొక్కేశారు..
ఇప్పుడు కేంద్రం నుంచి లేఖలు వస్తున్నాయి. అప్పుల లెక్కలు చెప్పకపోతే పర్మిషన్ ఇవ్వబోమని. ఇచ్చేసిన తర్వాత కూడా ఇలాంటి లేఖలు రాయడం కేంద్రానికే చెల్లుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిజాలు తెలుసుకోవాలంటే కేంద్రానికి గంటపని. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేయలేదు. అన్నీ బ్యాంకులు.. ప్రభుత్వ సంస్థల వద్దే చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పుల వివరాలు ఇవ్వాలంటే వారు క్షణంలో ఇస్తారు. కానీ ఎందుకు ఆలోచిస్తుందో .. ఎందుకు అప్పులు ఇప్పిస్తూ.. లెక్కలు చెప్పాలని లేఖలు రాస్తుందో అధికారులకు మాత్రమే తెలుసు.
శ్రీలంకలో సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నేపాల్ కుప్పకూలడానికి సిద్ధంగా ఉండి. ఇలాంటిపరిస్థితుల్లో ఆ ప్రభావం భారత్ పై పడకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.కానీ కేంద్రం రాష్ట్రాల విషయంలో పైపై చర్యలు చేస్తూ.. ఆర్థిక పరిస్థితి కుంగిపోయేలా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నారు. దీని ఫలితాలు అనుభవించాల్సింది ప్రజలే.