నానితో చేసిన టక్ జగదీశ్ సినిమాకి తమన్ తో కలసి పనిచేశాడు శివ నిర్వాణ. ప్రాజెక్ట్ సజావుగానే మొదలైయింది. కానీ మధ్యలో గోపి సుందర్ కూడా ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడు శివ నిర్వాణ. అయితే తన సినిమాని తమన్ పట్టించుకోకుండ మిగతా సినిమాలతో బిజీగా ఉంటున్నాడనేది శివ నిర్వాణ కంప్లైట్ అని అప్పట్లో వినిపించింది.
ఇప్పుడు విజయ్ దేవర కొండ శివ నిర్వాణ సినిమా మొదలైయింది. చాలా పెద్ద ప్రాజెక్ట్. తమన్ సూపర్ ఫామ్ లో వున్నాడు. ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ దాదాపు తమనే చేస్తున్నాడు. విజయ్ దేవర కొండ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా తమన్ కి వెళుతుందని అంతా అనుకున్నారు. పైగా మైత్రీ మూవీ మేకర్స్ కి అప్పుడే సర్కార్ వారి పాట రూపంలో హిట్ అల్బమ్ ఇచ్చాడు తమన్. మార్కెట్ ట్రెండ్ చూసుకున్నా తమన్ కే ఓటు పడాలి. కానీ అలా జరగలేదు. హృదయం ఫేం హిషామ్ అబ్దుల్ వాహబ్ ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు శివ నిర్వాణ. దీంతో తమన్ కి శివ కి మధ్య గ్యాప్ ఇంకా తగ్గలేదనే టాక్ బలపడింది.
మరో కోణం ఏమిటంటే.. ఈ సినిమా కోసం తమన్ దగ్గరకి వెళ్ళాడట శివ నిర్వాణ. అన్ని మర్చిపోయి మళ్ళీ కలసి పనిచెద్దామని కోరాడట. కానీ ఇప్పటికే బోలెడు భారీ సినిమాలతో బిజీగా వున్న తమన్.. ‘ఈసారికి వద్దు బ్రో .. మీకు కావాల్సిన టైం కేటాయించలేకపోవచ్చు” అని చాలా సున్నితంగా చెప్పాడని క్లోజ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మొత్తానికి తమన్, శివ నిర్వాణ కు మధ్య ఏదో జరిగింది. అదేంటనేది వారిద్దరికే తెలియాలి.