ప్రభుత్వంపై చంద్రబాబు ఉన్మాదిలా విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెలరేగిపోయారు. ఇన్ని రోజులు పార్టీలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఎవరికి పార్టీ పదవులు ఇవ్వాలన్నదానిరపై కసరత్తు చేసి.. వాటిపైనే ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన తీరికగా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై స్పందించడానికి ప్రెస్ మీట్ పెట్టి అన్నింటికీ చంద్రబాబే కారణం అని చెప్పడానికి తన టాలెంట్ అంతా చూపించారు.
పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది.. ఎందుకుదెబ్బతిన్నదంటే చంద్రబాబు అప్పట్లో నీళ్లివ్వడానికి వేగంగా పనులు చేయించారు అందుకే దెబ్బతిన్నదని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు డయాఫ్రం వాల్ ఎలా కట్టాలో నిపుణులకు కూడా తెలియడం లేదని ఆయన చెబుతున్నారు. అంటే పోలవరంపై చేతులెత్తేసి.. అంతా చంద్రబాబు వల్లే అనిచెబుతున్నట్లుగా ఉంది. సీఎం కాన్వాయ్ కోసం కారు తీసుకెళ్లడం.. జగన్ వెళ్తూంటే ఇనుప గ్రిల్స్ పెట్టడం… అందర్నీ హౌస్ అరెస్ట్ చేయడం వంటివి చంద్రబాబు హయాంలోనూ జరిగాయన్నారు. అయినా ఇప్పుడే జరుగుతున్నట్లుగా చెబుతున్నారని విమర్శించారు. రైతులు ఉరి వేసుకోవద్దు. వైయస్సార్సీపీకి ఉరి వేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారని.. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తోందన్నారు.
ఏపీ ప్రభుత్వ వ్యతిరేక మీడియాను బ్యాన్ చేసి చాలాకాలం అయింది. అసలు నిజాలు తెలియకుండా చేస్తున్నారని అనుకున్నారు కానీ.. ఇతర మీడియాలు కూడా ఇప్పుడు సంచలన ఘటనలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈక్రమంలో సజ్జల అన్నింటినీ అనుకూల మీడియా అంటూ చెప్పుకుంటూ పోతున్నారు. కొసమెరుపేమింటటే.. పుట్టినరోజు సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని.. శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని కోరుకున్నానని మీడియాకు చెబితే.. ఆ బిట్‌ను మీడియా ముందు ప్రదర్శించి.. ఇన్నాళ్లు ఆయనకు లేవా అని ప్రశ్నించారు సజ్జల. దేవుడి దగ్గర కోరుకున్న దానికీ పెడర్థాలు తీసి చంద్రబాబును విమర్శించడానిక ిచాలా కష్టరపడుతున్నారని వైసీపీ నేతలే గొణుక్కోవాల్సిన బాధ్యత.