నువ్ తమలాపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంటా అని తెలంగాణ నేతలు ఘాటు భాషతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మంత్రి కేటీఆర్ వరంగల్ సభలో బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై ప్రయోగించిన భాష చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చివరికి ఆయన మోదీని కూడా వదల్లేదు. బట్టేబాజ్ అని అనలేమా అని అనేశారు. మరి అన్ని మాటలు పడ్డ బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఊరుకుంటారా ? . వారు కేటీఆర్ ను ఇంకా దారుణంగా తిట్టారు.
దరిద్రుడా.. బట్టేబాజ్ తో పాటు చాలా తిట్లను అలవోకగా బండి సంజయ్ ప్రయత్ని.. సన్నాసి నా కొడుకా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని ఒక దరిద్రుడు మాట్లాడుతున్నాడు. ఓ దరిద్రుడా.. లెక్కలు రాకుంటే తెలుసుకో… అని గద్వాల సభలో బండి సంజయ్ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌పై మరింత దారుణంగా విరుచుకుపడ్డారు. ప్రతి సందర్భంలోనూ సన్నాసి నా కొడుకా అంటూ స్పందించి విమర్శలు చేశారు.
ప్రతి ఒక్కరూ నోరు తమకు మాత్రమే ఉందని.. తాము తిడితే ఎదుటి వారు భరిస్తారని అనుకోవడంతోనే సమస్య వస్తోంది. ఎంత మాటలైనా మాట్లాడటానికి అందరికీ నోరు ఉంటుంది. అందరూ సంయమనం పాటించినప్పుడే రాజకీయాల్లో విలువలు మిగులుతాయి. లేకపోతే ఏపీ రాజకీయాల్లోలా మారిపోతాయి. కుటుంబసభ్యులను సైతం కించపర్చుకునే పరిస్థితి వస్తుంది. దాని వల్ల రాజకీయంగా సాధించే లాభం ఏమీ ఉండదు. ప్రజల్లో చులకన కావడం తప్ప.