ఉచిత పథకాలను ప్రతిపక్షాలు ఆపేయమంటున్నాయని సీఎం జగన్ ప్రచారం ప్రారంభించారు. కోటి మందికిపైగా డ్వాక్రా మహిళకు రూ. పన్నెండు వందల కోట్లను సున్న వడ్డీ కింద జమ చేసే కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. సగటున.. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. వెయ్యి లభిస్తుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్ … ఉచిత పథకాలు ఇస్తూంటే.. ఏపీ శ్రీలంకలా అవుతోందని ప్రచారం చేస్తున్నారని.. ఉచిత పథకాల తమాషాలు ఇక ఆపాలంటేున్నారని ఆరోపించారు. ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, ఏపీ శ్రీలంకలా మారుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సీఎం జగన్ ఒక్క సారిగా పథకాలకు అడ్డం పడుతున్నారన్నట్లుగా మాట్లాడుతూడటంతో విపక్ష నేతలు కూడా ముందు ముందు వేరే రాజకీయం ఉందన్న ఆలోచనకు వస్తున్నారు. ఇప్పటికే కేంద్రం అప్పులు పుట్టనీయడం లేదు. ఒక వేళ ఇచ్చినా పెద్ద ఎత్తున పథకాలు ్మలు చేయడానికి సరిపోకపోవచ్చనేఅంచనా ఉంది. ఈక్రమంలో పథకాల లబ్దిదారులను భారీగా తగ్గిస్తున్నారు. ఇప్పుడు కొన్ని పథకాలకు బ్రేక్ వేసి.. ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
తానుగొప్ప పాలన చేస్తున్నానని జగన్ స్వయం కితాబు ఇచ్చుకున్నారు. తాను పాలిస్తే శ్రీలంక అవుతుందని అంటున్నారని.. చంద్రబాబు పాలిస్తే అమెరికా అవుతుందా అని ప్రశ్నించారు . ఎప్పట్లాగే ఆయన పవన్ కల్యాణ్… ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు. మహిళలకు డబ్బుల మీట నొక్కి ఎంత మంచి చేస్తున్నామో చెప్పుకోకుండా.. చంద్రబాబును తిట్టడానికి… ఘన కార్యాలను ప్రజలకు తెలిసేలా చేస్తున్న మీడియాను విమర్శించడానికి జగన్ సమయం కేటాయించడం వైసీపీ నేతలకూ పెద్దగా నచ్చడం లేదు.