శ్రీదేవి కుమార్తె జాన్వీ తెలుగు సినిమా ఎప్పుడు?
– ఎప్పటి నుంచో వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఎన్టీఆర్‌తో సినిమా ఓకే అంది.. చరణ్‌తో సినిమా చేసేస్తోంది.. అని వినడం తప్ప.. జాన్వీ నుంచి ఎలాంటి ప్రకటన ఎప్పుడూ రాలేదు. బోనీ కపూర్ సైతం..`మా జాన్వీ తెలుగులో తప్పకుండా నటిస్తుంది` అని చెప్పడమే తప్ప… అదెప్పుడన్న సంగతిలో క్లారిటీ ఉండదు. ఇప్పుడు కూడా జాన్వీ ఓ తెలుగు సినిమా ఒప్పుకుందని, త్వరలోనే ఆమె ఎంట్రీ ఖాయం అని ప్రచారం జరుగుతోంది. పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ని కథానాయికగా ఎంచుకున్నారని ప్రచారం జోరుగా సాగింది. `లైగర్` కోసం కూడా ఇలానే జాన్వీ కపూర్ ని ఎంచుకుందామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈసారి పక్కా.. అనేశారు.
అయితే ఇప్పుడు జాన్వీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. తాను ఇప్పటి వరకూ ఓ తెలుగు సినిమాకీ సంతకం చేయలేదని, ఏ ప్రాజెక్టులోనూ లేనని తేల్చేసింది. ఏదైనా సినిమాకి సంతకం చేస్తే.. ఆ విషయాన్ని తాను గానీ, నిర్మాణ సంస్థ గానీ, అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. సో.. పూరి కొత్త సినిమాలోనూ తాను లేదన్నమాట. గుడ్ లక్ జెర్రీ, మిలి అనే సినిమాల్ని పూర్తి చేసింది జాన్వీ. జవాల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరో. ఇవి తప్ప.. జాన్వీ మరో సినిమా ఒప్పుకోలేదు. సో.. జాన్వీ తెలుగు ఎంట్రీ కోసం ఇంకొన్నాళ్లు ఈ ఎదురు చూపులు తప్పవు.