మహేష్ బాబు సర్కారు వారి పాటకు గుమ్మడికాయ్ కొట్టేశారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పటికే టాకీ పూర్తయింది. అయితే ఒక పాట బ్యాలన్స్. ఈ పాటని హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలో వేసిన భారీ సెట్లో చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ ఈ రోజు పూర్తయింది. దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో మొదటి రెండు పాటలు, కళావతి, పెన్నీ.. ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. మూడవ సింగిల్ రేపు ఉదయం11:07 గంటలకు బయటికివస్తుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేష్ బాబు సూపర్ ఫామ్ లో వుండటం, అటు గీత గోవిందం తర్వాత పరశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట పై భారీ అంచనాలు వున్నాయి.