జాతీయ స్థాయిలో పోటీ ఖాయమని కేటీఆర్ టీవీ చానళ్లకు ఇచ్చిన తెలుగు ఇంటర్యూల్లో తేల్చి చెప్పేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారన్న సంకేతాలివ్వడానికే హఠాత్తుగా టీవీ చానళ్లకు ఇంటర్యూలుఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇంటర్యూల్లో వచ్చే ఎన్నికల్లో తమ విజయంపై ఎలాంటి డౌట్స్ లేవని కేటీఆర్ ధీమాగా ఉన్నారు.
తెలంగాణలో తాము కాంగ్రెస్తోనే పోటీ పడుతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంత కాదన్నా బీజేపీకి ఐదు సీట్లు వస్తే కాంగ్రెస్కు ఆరు సీట్లు వస్తాయి కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ మాకు ప్రత్యర్థి అని విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీని చచ్చిన పాముతో పోల్చారు కేటీఆర్. బీజేపీని తాము ప్రధాన ప్రత్యర్థిగా ఫోకస్ చేయడం లేదని.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టే ఫోకస్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి పనులు చేయకుండా ఇక్కడకు వచ్చి మాట్లాడితే అడుగుతాం.. గుడ్డలిప్పి నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఏపీ ప్రజల కంటే తెలంగాణ ప్రజలు వివేక వంతులని కేటీఆర్ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్లో కులాల రాజకీయం ఉందన్నారు. కులాల ప్రకారం అక్కడ విడిపోయారని.. కానీ ఏపీలో అలాంటి రాజకీయం లేదన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్నే నమ్ముకొని బరిలో దిగుతామని… మొదటి స్థానం మాది.. మిగతా స్థానాల్లో ఎవరు ఉంటారో కాలమే నిర్ణయిస్తుందన్నారు.