వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. చాలా రోజుల క్రితమే కేసు మొత్తం కొలిక్కి వచ్చింది.. ఇక నిందితుల్ని అరెస్ట్ చేయడమే మిగిలింది అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. ఏపీ ప్రభుత్వం రెచ్చగొట్టేలా ఏకంగా సీబీఐ అధికారులపైనే కేసులు పెడితే… ఇక రెట్టింపుగా శ్రమించి కేసును చేధిస్తారని అనుకున్నారు. కానీ సీబీఐ మాత్రం సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు సీబీఐని నమ్ముకుని నిజాలు చెప్పడానికి వచ్చిన వాళ్ల పరిస్థితి మాత్రం అటూ ఇటూ కాకుండా అయిపోతోంది.
అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇప్పుడు తనకు ప్రాణానికి ముప్పుందని మీడియా సమావేశం పెట్టి చెప్పుకున్నారు. పులివెందులలో ఉన్నంత సేపు మాత్రమే తనకు సెక్యూరిటీ ఉంటున్నారని బయటకు వెళ్తే ఎవరూ రావడం లేదంటున్నారు. ప్రతీ సారి సీబీఐ అధికారులకు ఫోన్లు చేసి సెక్యూరిటీ అడగాలంటే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు తన కదలికలు ఆరా తీస్తున్నారని.. అది రక్షణ కోసమో.. దేని కోసమే తెలియడం లేదంటున్నారు.
కేసును ఓ కొలిక్కి తీసుకు వస్తే రాజకీయ సంచనాలు నమోదవుతాయి. ఆ కేసుకు అడ్డం పడటానికి పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజలందరూ నమ్ముతున్నారు. వారి ప్రయత్నాలే సక్సెస్ అవుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురైనా.. ఆ కుటుంబానికి న్యాయం అందని పరిస్థితిఉందన్న నిరాశా నిస్ప్రహలు ప్రజల్లో ఏర్పడే ప్రమాదం పొంచింది. అవినీతి కేసుల్లోనే కాదు.. చివరికి హత్య కేసుల్లో నిందితుల్ని కూడా రాజకీ య బలంతో కాపాడుకుంటే ఇక వ్యవస్థల వల్ల ఉపయోగం ఏమిటన్న చర్చ సహజంగానే అందరిలోనూ వస్తుంది.