తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయాలని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టాడు రామ్ చరణ్. ఖైదీ నెంబర్ 150, సైరా.. ఇప్పుడు ఆచార్య సినిమాలు చరణ్ నిర్మాణంలోనే వస్తుంది. అయితే చరణ్ కి సమయం లేకపోవడంతో ఆచార్య నిర్మాణంలో పార్ట్నర్స్ ని కూడా చేర్చుకున్నారు. అలాగే ఇకపై తనకు పూర్తి సమయం ఉంటేనే సినిమాలు నిర్మాణం చేస్తానని చెప్పాడు చరణ్. ఇలాంటి నేపధ్యంలో మెగా డాటర్ సుస్మిత ప్రొడక్షన్ లో యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆమె సొంత బ్యానర్ లో తండ్రి చిరంజీవితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో చిరు , సుస్మితకి మాట కూడా ఇచ్చేశారు. త్వరలోనే దర్శకుడిని ఫిక్స్ చేసి సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. సుస్మిత ఎప్పటి నుంచో సినిమా రంగంలో వున్నారు. చిరు , చరణ్ సినిమాలు డిజైనర్ గా పని చేశారు. ఇప్పుడు తండ్రితో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల తర్వాత సుస్మిత నిర్మాణంలో సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.