తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కూతురి పెళ్ళికి స్టార్ హోటల్లో ‘మేఘా’ సంస్థ భారీ స్థాయిలో ఆర్థిక సాయం చేసినట్లు మీడియాలో వచ్చిన కథనాలను నిలిపివేయాలంటే ఆ ఖమ్మం కోర్టు నుంచి తెచ్చుకున్న ఆదేశాలను హైకోర్టు తోసి పుచ్చింది. వార్తలు ప్రసారం కాకుండా నిలువరించడమంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరాకరించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ కుమార్తె పెళ్లి పలు స్టార్ హోటళ్లలో ఐదు రోజుల పాటు జరిగింది. అత్యంత ఖరీదైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనూ ఓ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లి ఖర్చులన్నీ మేఘా కు చెందిన షెల్ కంపెనీలు పెట్టుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. “ది న్యూస్ మినిట్ ” వెబ్సైట్ బిల్లులతో సహా ప్రకటించింది. మేఘా కంపెనీ తెలంగాలో అత్యంత భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టింది. ఇరిగేషన్ శాఖనే రజత్ కుమార్ చూస్తూండటంతో అవి లంచం అనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయలేదు. కానీ మఘా మాత్రం ఆ వార్తలు ప్రసారం చేయకుండా సంబంధం లేని ఖమ్మం కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంది. ఇప్పుడా ఆదేశాలను హైకోర్టుతోసి పుచ్చింది. ఇప్పుడు మరోసారి రజత్ కుమార్ కూతురి పెళ్లికి మేఘా చదివింపుల అంశం చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.