ఈమధ్య వార్తల్లో ఇళయరాజా పేరు ఏదో ఓ రూపంలో గట్టిగానే వినిపిస్తోంది. ఆమధ్య ప్రధాని మోడీ జపం చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఆ తరవాత.. రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్నారని చెప్పుకున్నారు. అంతకు ముందు కాపీ రైట్స్ యాక్ట్ పై.. ఆయన కోర్టుకెళ్లారు. ఇలా.. తరచూ ఇళయరాజా పేరు కనిపిస్తోంది.. వినిపిస్తోంది. ఇప్పుడు మరోసారి ఆయన పేరు బయటకు వచ్చింది. దాదాపు రూ.2 కోట్ల మేర జీఎస్టీ ఎగ్గొట్టినందుకు ఆయనకు నోటీసులు అందాయి. వెంటనే జీఎస్టీ కట్టాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామన్నది ఆ నోటీసుల సారాంశం. ఇది వరకు కూడా.. ఇలాంటి నోటీసులే ఇళయరాజాకు అందాయి. అయితే.. వాటికి ఆయన స్పందించలేదు. ఇప్పుడు మరోసారి.. జీఎస్టీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కూడా ఇళయరాజా నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. చట్టపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది. జీఎస్టీ అనేది కేంద్రానికి సంబధించిన అంశం. ప్రధాని దృష్టిలో పడడానికి.. ఇళయరాజా వ్యాఖ్యలు చేశారని, ఆయన్ని పొగిడి…. రాజ్యసభ సీటో, లేదంటో పద్మ పురస్కారమో అందుకోవాలని ఇళయరాజా ఆశ పడ్డారని చెప్పుకొన్నారు. ఇప్పుడు ఇళయరాజాని జీఎస్టీ విషయంలోనే వదలడం లేదు. ఇక పద్మాలు, రాజ్యసభలూ ఇస్తారా?