కరోనాపై ప్రధాని మోడీ సీఎంలతో జరిపిన సమీక్షలో హఠాత్తుగా మోదీ పెట్రో ధరల ప్రస్తావన తెచ్చారు. పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణం అని విమర్శించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడం లేదని అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఎక్సైజ్ ట్యాక్స్‌ను కేంద్రం తగ్గించినా ఇతర రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలువ్యాట్‌ను తగ్గిస్తే ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. సమావేశంలోనే రాష్ట్రాలను పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి చేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. సీఎంల సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీకి బీజేపీయేతర ముఖ్యమంత్రులు చాలా తక్కువ మందే హాజరయ్యారు. ప్లీనరీ కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు. కానీ జగన్ హాజరయ్యారు.
గత ఏడాది నవంబర్‌లో దీపావళి సందర్భంగా లీటర్‌పై రూ. పది తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా మరికొంత తగ్గించాయి. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అత్యధిక రేట్లు ఉన్నాయి. దేశంలోనే ఏపీలో అత్యధిక రేట్లు ఉన్నాయి. సమావేశంలో నేరుగానే మోదీ చెప్పారు..మరి పెట్రోల్ డీజిల్ రేట్లు జగన్ తగ్గిస్తారో లేదో మరి !