ఏపీలో అసలు వైఎస్ఆర్సీపీకి 1751కి 175 సీట్లు ఎందుకు రాకూడదని పార్టీ నేతలను సీఎం జగన్ ప్రశ్నించారు. హఠాత్తుగా సీఎం జగన్ ఆ ప్రశ్న అడిగే సరికి అందరూ ఒకరూ మొహాలు ఒకరు చూసుకున్నారు.. అవును.. ఎందుకు రాకూడదు అని వారు కూడా తమ మనసులో ప్రశ్నించుకున్నారు. రావొచ్చు .. రాకూడదనేం లేదని అని జగన్‌కు చెప్పాలనుకుని ఆయన వైపు చూశారు కానీ.. అప్పటికి సీఎం జగన్ వేరే టాపిక్మీదకు వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి కొత్త జిల్లాల అధ్యక్షలు.. రీజనల్ కోఆర్డినేటర్లు.. కీలక నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెలుపు కోసం ఏం చేయాలో.. ఏం చేస్తమో దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం అరవై ఐదు శాతంతో తన గ్రాఫ్ బాగుందని జగన్ స్పష్టం చేశారు. సీఎంగా ఎమ్మెల్యేగా.. పార్టీ అధినేతగా తన గ్రాప్ చాలా బాగుందన్నారు. కానీ చాలా మంది పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ నలభై శాతం మాత్రమేనని వారందరూ .. తమ గ్రాఫ్ మెరుగుపర్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయని.. ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదన్నారు. మే నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం అందరూ సిద్ధం కావాల్సిందేన్నారు. మే 10వ తేదీ నుంచి ఇంటింటికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
పార్టీ జిల్లా అధ్యక్షులకు కేబినెట్ ర్యాంక్‌తో పదవి ఉండేందుకు.. జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తామని.. ప్రకటించారు. అధికారంలో ఉండి కూడా రెండేళ్ల ముందు నుంచేవచ్చే ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న పార్టీ తమదేనని సీఎం జగన్ గుర్తు చేసశారు. మ, వార్డు సచివాలయాల సందర్శన విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సీరియస్‌గా ఉండాలని జగన్ స్పష్టం చేశఆరు. నెలకు కనీసం పది గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్నారు. ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే వారందరికీ వనరులు సమకూరుస్తామని జగన్ హామీ ఇచ్చారు.