‘అ’ సినిమాతో అందరినీ అబ్బురపరిచాడు ప్రశాంత్ వర్మ. చేసిన మొదటి సినిమాకే తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా ప్రశాంత్ వర్మ మార్క్ ని నిలబెట్టుకున్నాయి. ఇప్పుడు మరో వైరైటీ స్క్రిప్ట్ తో రెడీ అవుతున్నాడు. పది మంది హీరోయిన్లతో ఒక కథని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇదో డిఫరెంట్ సబ్జెక్ట్. పాత్రకి మరో పాత్రకి ముడివేస్తూ చివర్లో ఆ చిక్కుముడులన్నీ తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో రివిల్ చేసేలా డిజైన్ చేశాడు. దీని కోసం ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేని రాసుకుంటున్నాడని తెలిసింది. ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ని సంప్రదించడం ఆమె ఓకే చెయ్యడం జరిగిపోయింది. మిగతా హీరోయిన్లు కూడా పేరున్న వారినే తీసుకోవాలనే ఆలోచన వున్నారు. త్వలోనే ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.