ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నింటినీ రాజకీయం చేసి.. ఆ వ్యవస్థలు ప్రజలకు ఉపయోగపడకుండా చేయడంలో మరో ముందడుగు వేశారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తనకు అవమానం జరిగిందంటూ చంద్రబాబు, బొండా ఉమలకు నోటీసులు జారీ చేసి.. దాని మీదే మీడియాలో ఇంటా బయట చర్చలు జరిపి అసలు సమస్యలను పక్కన పెట్టేశారు. మహిళా కమిషన్ ఎందుకు పెట్టారు.. ఆ కమిషన్కు ఎందుకు అధికారాలు దఖలు పరిచారన్న కనీస విషయం కూడా మర్చిపోయి.. పూర్తిగా రాజకీయం చేసేశారు. ఇప్పుడు మహిళా కమిషన్ అంటే .. అదేదో వైసీపీ రాజకీయ విభాగం అన్నట్లుగా అభిప్రాయం ఏర్పడిపోయింది.
నిన్నామొన్నటిదాకా .. కనీసం కమిషన్ బాధితులకు సాంత్వన చేకూరుస్తుందన్న అభిప్రాయం ఉండేది . ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. మహిళా కమిషన్ సభ్యులందరూ మీడియా ముందుకు వచ్చి.. టీడీపీని.. చంద్రబాబును తిట్టడానికే సమయం కేటాయించారు తప్ప.. నిజంగా ఏపీలో అన్యాయమైపోతున్న మహిళల గురించి ఒక్క శాతం కూడా కన్సర్న్ చేయలేదు. వీరి తీరు చూసి.. మహిళా కమిషన్ .. మహిళపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తుందని.. బాధితుల్ని ఆదుకుంటున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు.
ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ… రాజకీయాల కోసమే సమయం సమయం కేటాయించడం … మహిళా కమిషన్ కార్యాలయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం… తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. లేని అధికారాన్ని దఖలు పర్చుకుని చేసిన రాజకీయ విన్యాసాలతో… మహిళా కమిషన్కు ఉన్న విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంసమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది.