మారుతి మంచి రైటర్. చాలా డిఫరెంట్ కాన్సెప్టలు ఆలోచిస్తాడు. ఇప్పటికే మారుతి దగ్గర ఒక స్క్రిప్ట్ బ్యాంక్ వుంది. కొన్ని కాన్సెప్ట్ లు బయటకి కూడా ఇస్తుంటారు. ఇప్పుడు మారుతి కథతో ఓ సినిమా ప్రకటన రానుంది. ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన అనుభవం వున్న దర్శకుడు మారుతి కథతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే నిర్మాతలు ఓకే అయ్యారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. మారుతి ప్రస్తుతం ప్రభాస్ సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఇప్పుడు బయటికి ఇవ్వబోతున్న స్క్రిప్ట్ మారుతి ఎప్పుడో ఏడాది క్రితం రాసిందే. బాండ్ స్క్రిప్ట్ దర్శకుడి చేతిలో పెట్టాడు మారుతి. అయితే తను కథ ఇస్తున్న చిత్రానికి స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత పనిలో ఇన్వాల్ కానని మొదటే క్లారిటీగా చెప్పేశాడు మారుతి. ఇప్పుడు మారుతి ధ్యాస అంతా ప్రభాస్ సినిమాపైనే వుంది. మరికొద్ది రోజుల్లో మారుతి కథ అందిస్తున్న సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.