దుగ్గిరాలలో నారా లోకేష్‌పై రాళ్ల దాడికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డ్రైవర్ ప్రయత్నించారు.ఆ రాళ్లు పోలీసులలను తాకాయి.పెద్ద పెద్ద రాళ్లు విసరడంతో ఇద్దరు పోలీసుల తలలు పగిలినట్లుగా తెలుస్తోంది. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మహిళ హత్యకు గురయింది. తెనాలి ఆస్పత్రిలో లోకేష్ ఆమె కుటుంబసభ్యులను పరామర్శించాలనుకున్నారు. కానీ లోకేష్ రాక ముందే ఆస్పత్రి నుంచి పోలీసులు ఆమె మృతదేహాన్ని ఇంటికి పంపేశారు. దీంతో లోకేష్ తుమ్మపూడి గ్రామానికి వెళ్లారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
పోలీసులు చూస్తూ ఉండిపోయారు. వైసీపీ నేతల్ని అక్కడ్నుంచి పంపేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడతో వారికే రాళ్ల దెబ్బలు తగిలాయి. లోకేష్ పర్యటించక ముందే మహిళది గ్యాంగ్ రేప్ కాదని..వివేహేతర బంధం వల్ల జరిగిన హత్య అని ఎస్పీ ప్రకటించారు. అప్పటికి పోస్ట్ మార్టం కాలేదు. పోస్ట్ మార్టం జరగకుండానే అలా ప్రకటించడం ఏమిటని నారా లోకేష్ ప్రశ్నించారు. కొద్ది రోజులుగా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో తనకు పెద్దగా ఓటింగ్ రాని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ఆర్కే వివిధ సమస్యల కారణంగా బయటకు రాలేకపోతున్నారు. తుమ్మపూడి మంగళగిరి నియోజకవర్గంలోనే ఉండటంతో ఆర్కే డ్రైవర్ ప్రత్యేకంగా తుమ్మపూడికి వచ్చి వైసీపీ సానుభూతి పరుల్ని పురమాయించి రాళ్ల దాడికి పురమాయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితేఇలాంటి దాడులకు భయపడబోమని.. ఇరవై ఒక్క రోజుల్లో నిందితులకు శిక్ష వేయకపోతే.. మళ్లీ వస్తానని లోకేష్ ప్రకటించారు.