భారతీయ జనతా పార్టీ నేతలు తెగించేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ గొప్పతనాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో జరుగుతున్న హిందీపైచర్చలో ఉత్తరాది బీజేపీ నేతలు జోక్యం చేసుకున్నారు. దేశంలో ఉండాలంటే హిందీ మాట్లాడాల్సిందేనని లేకపోతే వారు విదేశీయులేనని ్ంటున్నారు. భారతదేశంలో నివసించాలనుకునే వారు హిందీని ప్రేమించాల్సిందేనని యూపీ మంత్రి సంజయ్ నిషాద్ స్పష్టం చేశారు. మీరు హిందీని ఇష్టపడకపోతే, మీరు విదేశీయుడిగా , విదేశీ శక్తులతో ముడిపడి ఉన్నారని అనుకుంటామని దక్షిణాది ప్రజల్ని హెచ్చరించారు.
మేము ప్రాంతీయ భాషలను గౌరవిస్తాము, కానీ ఈ దేశం ఒకటి, మరియు భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం, భారతదేశం ‘హిందూస్థాన్’ అంటే హిందీ మాట్లాడే వారి ప్రదేశం అని తేల్చి చెప్పారు. అంటే హిందీమాట్లాడే ప్రదేశం ఇండియా అని తీర్పిచ్చేసారు. హిందుస్థాన్ హిందీ మాట్లాడని వారికి చోటు కాదు. వాళ్ళు ఈ దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళాలి” అని సంజయ్ నిషాద్ హెచ్చరించారు. వీరు ఇలా మాట్లాడటానికి ప్రేరణ అమిత్‌షానే. ఒకే దేశం – ఒకే భాష అంటూ.. గతంలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమనిచెప్పారు. ఆయన నోటి నుంచి హిందీ భాష గురించి కామెంట్లురాగానే మిగిలిన వారు.. రెచ్చిపోతున్నారు. దక్షిణాదిప్రజలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.