ఏలూరు జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి.కొత్తపల్లి గ్రామ ప్రజలు దాడి చేశారు. హత్యకు గురైన గంజి ప్రసాద్ అనే వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వచ్చారు. అయితే గంజి ప్రసాద్ హత్యకు కుట్రదారుడు ఎమ్మెల్యేనేనని గ్రామస్తులు గుర్తించి ఆయనపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలుననాయి. ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతిస్తున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి చెందిన గంజి ప్రసాద్‌ను వ్యతిరేక వర్గం కత్తులతో నరికి చంపింది. హత్య గురించి తెలిసి తలారి వెంకట్రావు గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన హత్య చేశారని భావిస్తున్న వర్గంతోనే ఎక్కువగా మాట్లాడటం.. గంజి ప్రసాద్ అనుచరుల్ని ఆగ్రహానికి గురి చేసింది. తలారి వెంకట్రావు హత్యకు ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందని అనుమానంతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు.
ఎమ్మెల్యేకు రక్షణగా ఆ గ్రామానికి పోలీసులు వెళ్లారు. పోలీసులు ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయనపై గ్రామస్తులు దాడి చేసి కొట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పార్టీలో వర్గ విభేదాలను పెంచుతూ.. రెండు వర్గాలు చేసి.. చేస్తున్న రాజకీయం వల్ల వైసీపీ నేతలు కూడా హత్యలకు గురవుతున్నారన్న ఆరోపణలు ఆ జిల్లాలో వినిపిస్తున్నాయి.